
నయనతారకు విలన్!
వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాలతో పాటు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఎంతవాడు గాని’ వంటి డబ్బింగ్
వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాలతో పాటు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఎంతవాడు గాని’ వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా దర్శకుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్ మీనన్. అడపా దడపా అతిథి పాత్రల్లో తెరపై కనిపిస్తుంటారాయన. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గా నటించనున్నారని చెన్నై టాక్. నయనతార కథానాయికగా తమిళంలో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం గౌతమ్ మీనన్‌ను విలన్ పాత్రకు అడిగారట. కథ విని, ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.