
ధనుష్‌కు విలన్‌గా గౌతంమీనన్
సాధారణంగా కథానాయకుడికి దర్శకుడికి మధ్య మంచి ర్యాప్ ఉంటుంది. అప్పుడే సినిమా మంచి విలువలతో రూపొందుతుంది. అలా కాకుండా వారిద్దరి మధ్య అండర్‌స్డాండింగ్ కొరవడితే ఆ చిత్రానికి కష్టకాలమే అవుతుంది. అయితే అదే ఇద్దరు రియల్‌గా కాకుండా రీల్‌లో ఢీకొంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. తాజాగా నటుడు ధనుష్, దర్శకుడు గౌతంమీనన్‌ల మధ్య అలాంటి పోరే జరుగుతోంది.
దర్శకుడు గౌతంమీనన్ తన తొలి చిత్రం మిన్నలే నుంచే వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే హీరోలు కూడా ఆయన విలన్‌గా నటించడానికిసై అంటుంటారు. కాక్క కాక్క చిత్రంలో నటుడు జీవన్‌ను సూర్యకు విలన్‌ను చేశారు. ఆ చిత్రం తరువాత జీవన్ హీరో అయిపోయారు. అదే విధంగా అజిత్ ఎన్నై అరిందాల్ చిత్రంలో నటుడు అరుణ్‌విజయ్‌ను విలన్‌ను చేశారు. ఆ చిత్రం తరువాత ఆయన మార్కెట్ వేరే స్థాయికి చేరింది.
ఇలా చాలా మందిని విలన్‌గా మార్చిన దర్శకుడు గౌతంమీనన్ తాజాగా ఆయనే ధనుష్‌కు విలన్‌గా మారారు. తన చిత్రాల్లో గెస్ట్‌గా తళుక్కుమనే గౌతమ్‌మీనన్ ఇప్పుడు ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం ఆయన ధనుష్ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఒక విలన్‌గా నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఆయనకు దీటైన మరో విలన్‌గా ధనుష్‌తో ఢీకొంటున్నారు గౌతంమీనన్. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అని చిత్ర వర్గాలు తెలిపారు.