స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా! | Dhanush, Gautham Menon Movie Release Postponed | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

Sep 5 2019 3:50 PM | Updated on Sep 5 2019 3:50 PM

Dhanush, Gautham Menon Movie Release Postponed - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇటీవల పారితోషికం విషయంలో నిర్మాతలపై ధనుష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఎన్నో వాయిదాల తరువాత ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అయిన ‘ఎనై నోకి పాయం తోట’ సినిమా మరోసారి వాయిదా పడింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, ధనుష్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఎనై నోకి పాయం తోట. ఈ సినిమాను ఆ నెల 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది. ఒక రోజు ఆలస్యంగా అయిన సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సినిమా కావటంతో ఈ మూవీపై ఆశించిన స్థాయిలో హైప్‌లేదు. ఇప్పుడు మరోసారి వాయిదా పడితే సినిమా ఫలితంపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమా తెలుగులో తూటా పేరుతో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement