
ధనుష్, మేఘాఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఎౖనైనోకి పాయుం తూటా’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ పతాకంపై మదన్ నిర్మించారు. చాలా కాలం కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్యకారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అలాంటిది ఎట్టకేలకు చిత్రాన్ని ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే చెప్పినట్టుగా 6వ తేదీన కూడా విడుదల చేయలేకపోయారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయడానికి శాయశక్తులా ప్రయత్నించామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా వేస్తున్నామన్నారు. చిత్ర విడుదలలో జాప్యం వల్ల కలిగే నిరాశ, జరుగుతున్న ప్రచారం గురించి తమకు తెలుసన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభిమానుల సహనం, ఆదరణ తమకు కావాలని కోరుకుంటున్నామన్నారు. అతి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తామన్నారు. చిత్రం చూసిన తర్వాత ఇంత కాలం వేచి చూసిన ప్రేక్షకులకు సంతృప్తి కలిగిస్తుందని నమ్మకంగా చెప్పగలమని నిర్మాతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment