స్వీయ దర్శకత్వంలో అతిథిగా.. | Dhanush makes entry in Hollywood | Sakshi
Sakshi News home page

స్వీయ దర్శకత్వంలో అతిథిగా..

Published Sun, Sep 25 2016 2:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

స్వీయ దర్శకత్వంలో అతిథిగా..

స్వీయ దర్శకత్వంలో అతిథిగా..

 కథానాయకుడిగా ఏకకాలంలో రెండు చిత్రాలు, మరో పక్క చిత్ర నిర్మాణం, త్వరలో హాలీవుడ్ చిత్ర రంగప్రవేశం ఇలా నటుడిగా చాలా బిజీగా ఉన్నా మరో పక్క మెగాఫోన్ పట్టాలన్న తన చిరకాల ఆశను నెరవేర్చుకుంటున్నారు ధనుష్. ఈయన నటించిన తొడరి చిత్రం ఇటీవలే విడుదలైంది. మరో చిత్రం కొడి త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై, ఇంకో పక్క గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రాల్లో నటిస్తున్నారు.
 
  ఇక రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలో పవర్ పాండి అనే చిత్రానికి ధనుష్ దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలతో పాటు, అతిథి పాత్రలో మెరిసే మరో బాధ్యతను తానే మోస్తున్నారన్నది తాజా సమాచారం. ప్రసన్న, శాయాసింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్‌రాజ్ ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుపుకుంటోంది.
 
 కాగా ఇది ఒక స్టంట్ మాస్టర్ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిసింది. ఇందులో స్టంట్ మాస్టర్‌గా నటిస్తున్న రాజ్‌కిరణ్ బాల్య పాత్రలో ధనుష్ మెరవనున్నారట. అన్నట్టు ఈ చిత్రానికి కథ, కథనాలను ధనుష్‌నే తయారు చేసుకున్నారు. ఇన్ని బాధ్యతలను ఏకకాలంలో ఎలా నిర్వహించగలుగుతున్నారన్న ప్రశ్నకు తాను ప్రేమిస్తున్నది సినిమానేనని నిజాయితీగా బదులిచ్చారు ధనుష్. ఈయన నటుడిగా, నిర్మాతగా గీత రచయితగా, గాయకుడిగా సక్సెస్ అయ్యారన్నది తెలిసిందే. ఇక దర్శకుడిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో అన్నది పవర్ పాండి నిర్ణయించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement