
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో అలరించిన ధనుష్.. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Dhanush Starrer Hollywood Movie The Gray Man Trailer Released: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో అలరించిన ధనుష్.. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో ధనుష్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్.
మార్క్ గ్రేనీ నవల 'ది గ్రే మ్యాన్' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. వీరు బాక్సాఫీసును షేక్ చేసిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇందులో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 15న థియేటర్లలో, జూలై 22న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కాగా ధనుష్‌కు ఇది రెండో ఇంటర్నేషనల్ సినిమా. ఇదివరకు 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' సినిమాతో హాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.
చదవండి: 👇
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment