పూరీ కంటే చార్మీ ఎక్కువ కష్టపడింది: లైగర్‌ విలన్‌ | Liger Movie Villain Vish Interesting Comments About His Film | Sakshi
Sakshi News home page

Vish: లైగర్‌ ట్రైలర్‌ రిలీజయ్యాక కరణ్‌ జోహార్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది

Published Thu, Aug 11 2022 8:36 PM | Last Updated on Thu, Aug 11 2022 8:38 PM

Liger Movie Villain Vish Interesting Comments About His Film - Sakshi

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల పాన్ ఇండియా ప్రాజెక్ట్  'లైగర్' ఆగస్ట్ 25న విడుదల కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన నటుడు విష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన పంచుకున్న లైగర్ చిత్ర విశేషాలివి.. 

దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మీ ప్రయాణం? 
పూరీ గారిని కలవక ముందే ఆయన సినిమాలకు అడిక్ట్ అయ్యాను. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయన్ని కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా చేద్దామని అప్పుడే లైగర్ ఐడియా చెప్పి టచ్ లో వుందామని చెప్పారు. ఎట్టకేలకు లైగర్ తో నా కల తీరింది. పూరి గారు, విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ .. ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా. 

పూరి కనెక్ట్స్ సిఈవో ఎలా అయ్యారు? 
పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశాను. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్, సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి  సిఈవోని చేశారు. 

విజయ్, మైక్ టైషన్ లాంటి బలమైన పాత్రల మధ్య మీ రోల్ ఎలా ఉండబోతుంది?
విజయ్, నా పాత్రల మధ్య శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. లైగర్‌లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైషన్ గుర్తుకువస్తారు. ఆయన కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది. 

మైక్ టైసన్ నుంచి ఏం నేర్చుకున్నారు ? 
చిన్నప్పటినుంచి మైక్ టైసన్కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో ఆయన అంత స్వీట్గా ఉన్నారు. నీకు సంతోషాన్ని ఇచ్చేదే చెయ్ అని చెప్పేవారు.

మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? 
పూరి గారిదే. అయన రెబల్. ఆయనకి సరిహద్దులు వుండవు. పరిమితులు ఎప్పుడూ పెట్టుకోరు. నేను కూడా ఆయనలానే లిమిట్స్ పెట్టుకోను. అయితే మైక్ని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి చార్మీగారు ఎక్కువ కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. 

మిగతా స్పోర్ట్స్ డ్రామాలకు లైగర్ కు వున్న ప్రత్యేకత ఏమిటి ? 
లైగర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. లైగర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అలాగే మైక్ టైసన్ కూడా మీరు గమనిస్తే బాక్సింగ్ రింగ్ లో కనిపించరు. కౌబాయ్ గెటప్ లో వున్నారు. ఆయన కమర్షియల్ పాత్రలో కనిపిస్తారు. 

కరణ్ జోహార్ సినిమా చేస్తున్నారా?
లైగర్ ట్రైలర్ రిలీజైన తర్వాత రోజే కరణ్ జోహార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నరేషన్ గురించి రమ్మన్నారు. అలాగే తమిళ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. పూరీ గారితో చెప్పాను. ట్రైలర్ లో ఒక్క గ్లింప్స్ కే ఇలా వుంటే సినిమా విడుదలైన తర్వాత ఎలా వుంటుందో చూడు అన్నారు. పూరి గారు నా గురువు. ఆయనతో అన్నీ పంచుకుంటా. 

ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా జరిగింది?
ఇంటర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశాను. ఈ ప్రయాణం అంత తేలికగా జరగలేదు. చాలా ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను.

మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ? 
మాది చేవెళ్ళ దగ్గర కడుమూరు. అయితే పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. నాన్న వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ హోం మేకర్. ఇద్దరు సిస్టర్స్ విదేశాల్లో వున్నారు. నేను పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమాను మా ఫ్యామిలీకి అంకితం చేస్తున్నా. 

నెగిటివ్ పాత్రలు చేయడానికే ఇష్టపడతారా ? 
నటుడిగా అన్ని పాత్రలు చేస్తాను. నేను ఒక తెల్లకాగితం. దర్శకుడు దానిపై ఏది రాస్తే అది అవుతా. 

వెబ్ సిరీస్ ఆలోచనలు ఉన్నాయా ? 
పూరీ గారి దగ్గర చాలా కథలు వున్నాయి. నేను కూడా రాస్తాను. మంచి ఉత్సాహం వున్న టీమ్ తో కలసి పని చేయాలనీ వుంది. కంటెంట్ టీం ఏర్పడటానికి సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు జనగణమన, లైగర్ చేస్తున్నాము. చాలా ఆలోచనలు వున్నాయి. రిజినల్, వెబ్ సిరిస్లు పాన్ ఇండియా సినిమాలు చేయాలి. అలాగే పూరి గారితో ఒక హాలీవుడ్ సినిమాకి డైరెక్షన్ చేయించాలి.

చదవండి: ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నందమూరి బాలకృష్ణ
ఆ యాంకర్‌తో కొణిదెల హీరో ఎంగేజ్‌మెంట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement