సంక్రాంతి పోటీ భలే రంజుగా మారింది. నాలుగు సినిమాలు పందెం కోళ్లలా బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇకపోతే రేపు (జనవరి 12న) గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతుండగా, సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ ఆ మరుసటి రోజున విడుదల కానున్నాయి. అయితే గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాల్లో విలన్‌గా నటించిన మధుసూదన రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.
నాకు తెలియకుండానే సినిమా పూర్తి చేశాడు
'అమ్మది ఖమ్మం, నాన్నది ఒంగోలు. నేను పుట్టిపెరిగింది, చదువుకుందంతా కర్ణాటకలో! నన్ను విలన్‌గా గుర్తించిన డైరెక్టర్ దేవ్ కట్టా. ఆయన దర్శకత్వం వహించిన ఆటో నగర్ సూర్య సినిమా తర్వాత ఇక్కడ దశ మారుతుందనుకున్నాను. అందరూ అద్భుతంగా చేశావని చెప్పేవారే తప్ప అవకాశాలు మాత్రం ఎక్కువగా ఇవ్వలేదు. అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాను. నా భార్య శృతి కూడా విలన్‌గా యాక్ట్ చేసింది. మాకు ఇద్దరు కుమారులు సంతానం. ఓ కుమారుడు ప్రీతమ్ నాకు తెలియకుండానే సినిమా చేశాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే చిత్రంలో నటించాడు. అంతా అయ్యాక సినిమా చేశానని చెప్పడంతో షాకయ్యాను. తను కళ్ల ముందే ఎదుగుతున్నందుకు ఉప్పొంగిపోయి ఆనందంతో ఏడ్చేశాను. అయితే నా పేరు ఎక్కడా వాడకూడదని తనకు కండీషన్ కూడా పెట్టాను. కానీ .
రోజంతా కష్టపడితే..
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజంతా పని చేస్తే రూ.300 వచ్చేవి. కెప్టెన్ విజయ్‌కాంత్ అంటే చాలా ఇష్టం. ఆర్మీ నుంచి యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇన్నేళ్లలో వందల కోట్లు సంపాదించాననుకుంటారు. కానీ అంత సీన్ లేదు. లక్ష రూపాయలు వస్తే అందులో 30% జీఎస్టీ పోతుంది. నా మేనేజర్‌కు, మేకప్‌మెన్‌కు.. వారికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఎవరికైనా డబ్బు కావాలంటే సాయం చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషల్లో నటించాను. ఈసారి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చాడు మధుసూదనరావు.
చదవండి: కమల్, శ్రీవిద్య లవ్‌స్టోరీ.. పెళ్లి చేసుకుంటానన్న కమల్.. కానీ!
Comments
Please login to add a commentAdd a comment