
విలన్‌గా చేయడానికి రెడీ!
వెండితెరపై విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిజమ్ చూపించినవాళ్లు తక్కువమందే ఉన్నారు. అలాంటి కొద్ది మంది ఆర్టిస్టుల్లో శ్రీకాంత్ ఒకరు. నెగటివ్ రోల్స్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వరుస విజయాలు అందుకుని, ఫ్యామిలీ హీరోగా మినిమమ్ గ్యారెంటీ మార్కెట్ సాధించుకున్నారు. ‘ఖడ్గం’తో సీరియస్ పోలీసాఫీసర్‌గానూ మెప్పించిన ఈ హీరో ఆ తర్వాత అడపాదడపా ఖాకీ డ్రెస్ వేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తున్నారు.
తనయుడు రోషన్‌ని ‘నిర్మలా కాన్వెంట్’ ద్వారా హీరోని చేసి, ‘మెంటల్’గా ప్రేక్షకుల ముందుకి వస్తున్న శ్రీకాంత్ మంచి పాత్ర దొరికితే విలన్‌గా దుమ్ము రేపడానికి రెడీ అంటున్నారు. శ్రీకాంత్ సరదా సరదాగా చెప్పిన విశేషాలు ఈ రోజు రాత్రి 7.30 ని.లకు సాక్షి టీవీలో ‘సరదాగా కాసేపు’ స్పెషల్ ఇంటర్వ్యూలో...