
కొన్నిసార్లు నటీనటులు లక్కీఛార్మ్స్ అయిపోతుంటారు. వీళ్లు నటిస్తే హిట్ అనమాట.

అలా రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన నటుడు తారక్ పొన్నప్ప.

ఇతడి పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ చూస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.

స్వతహాగా కన్నడ యాక్టర్ అయిన ఇతడు.. గత కొన్నేళ్లలో నాలుగు పాన్ ఇండియా మూవీస్ చేశాడు. అన్నీ హిట్టే.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తారక్ పొన్నప్ప.. కన్నడలో తొలుత రియాలిటీ షోలు, పలు చిత్రాల్లో నటించాడు.

ఎప్పుడైతే 'కేజీఎఫ్ 1&2' చేశాడో.. మన దర్శకుల దృష్టిలో పడిపోయాడు.

అలా ఎన్టీఆర్ 'దేవర'లో విలన్ కొడుకుగా మంచి రోల్ దక్కించుకున్నారు. గుర్తింపు బాగానే వచ్చింది.

తాజాగా 'పుష్ప 2'లోనూ బుగ్గారెడ్డి అనే పాత్రలో విలనిజం పండించాడు.

విచిత్రం ఏంటంటే కన్నడ సినిమాలు కాకుండా ఇప్పటివరకు నాలుగు పాన్ ఇండియా మూవీస్ చేస్తే అన్నీ హిట్టే.

అలా తారక్ పొన్నప్ప ఇప్పుడు దక్షిణాదిలో టాక్ ఆఫ్ ది యాక్టర్ అయిపోయాడు.
