Kabir Duhan Singh to Tie the Knot, Find Out the Date - Sakshi
Sakshi News home page

Kabir Duhan Singh: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్‌ విలన్‌, అమ్మాయి ఎవరంటే?

Published Wed, Jun 21 2023 1:31 PM | Last Updated on Wed, Jun 21 2023 2:40 PM

Kabir Duhan Singh To Tie Knot On This Date - Sakshi

జిల్‌, కిక్‌ 2, స్పీడున్నోడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, సుప్రీం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కబీర్‌ దుహాన్‌ సింగ్‌. హర్యానాలో పుట్టి పెరిగిన అతడు మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్‌ సినిమాతో తన సత్తా చూపించి టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా మారిపోయాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకులనూ విలన్‌గా భయపెట్టాడు.

తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. సౌత్‌లో విలన్‌గా రఫ్ఫాడిస్తున్న ఇతడు ఇటీవలే శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు. తాజాగా కబీర్‌ పెళ్లికి బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన యువతిని పెళ్లాడబోతున్నాడట! జూన్‌ 23న హర్యానా సూరజ్‌ఖండ్‌లోని గ్రాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం.

ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు, ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ శుభకార్యం జరగనుంది. ఈ రోజు మెహందీ ఫంక్షన్‌తో పెళ్లి సంబరాలు షురూ కానున్నాయట! శుక్రవారం పెళ్లయిపోగానే అదే రోజు రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీప్రముఖులు సైతం హాజరు కానున్నారట! కాగా కబీర్‌ పెళ్లాడబోయే అమ్మాయి సీమా చాహల్‌ అని, తను వృత్తి రీత్యా టీచర్‌ అని తెలుస్తోంది.

చదవండి: ప్రేమలో అదే పెద్ద సమస్య: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement