Kabir Duhan Singh Wedding With Seema Chahal, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Kabir Duhan Singh Marriage: తొలిచూపులోనే అర్ధాంగిగా ఫిక్సయ్యానన్న విలన్‌.. పెళ్లి ఫోటోలు వైరల్‌

Published Sat, Jun 24 2023 5:30 PM | Last Updated on Sat, Jun 24 2023 7:11 PM

Kabir Duhan Singh Wedding Photos Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా పేరు గడించిన నటుడు కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ఓ ఇంటివాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌తో ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా కబీర్‌ దుహాన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. 'జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, నా అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు నా భార్య సీమకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితంలో నేను బెస్ట్‌ హీరోగా ఉండాలనుకుంటున్నాను.

నేను సీమాను కలిసిన క్షణంలోనే తనే నా అర్ధాంగి అనిపించింది. నన్ను, నా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం కలిగింది. తను ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. నేనెప్పుడూ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అదే నిజమైంది. తనతో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు

కాగా హర్యానాలో పుట్టి పెరిగిన కబీర్‌ దుహాస్‌ సింగ్‌ మొదట మోడల్‌గా పని చేశాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్‌ సినిమాలో తన సత్తా చూపించి టాలీవుడ్‌కు ఒక కొత్త విలన్‌ దొరికాడని అందరూ అనుకునేలా చేశాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకులనూ భయపెట్టాడు. ఈ రెండు భాషల్లోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేస్తున్నాడు. సౌత్‌లో విలన్‌గా అదరగొడుతున్న అతడు ఇటీవల వచ్చిన శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement