సారూ.. కొంచెం నేర్పించరూ!
విశాల్ తెలుగు కుర్రాడు. కానీ, తమిళ్ బాగా మాట్లాడతాడు. ఎందుకంటే, ఉంటున్నది చెన్నైలో కదా. అయినా మాతృభాష అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కదా అందుకే, తమిళంలో తాను చేస్తున్న చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుంటారు. ఇప్పుడీ హీరో మలయాళ భాష నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకంటే, అక్కడ ‘విలన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘సారూ.. కొంచెం మలయాళం నేర్పించరూ’ అంటూ విశాల్ డైరెక్టర్ హెల్ప్ తీసుకుంటున్నారట. మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశాల్ డాక్టర్‌గా యాక్ట్ చేస్తున్నారట. ఇందులో విశాల్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు.