Malayalam language
-
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
‘కొంచెం కష్టమే. అయినా నేర్చుకుంటాను’
‘‘తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... ఇలా పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక యాక్టర్‌గా నన్ను నేను నిరూపించుకునేందుకు మరింత ఆస్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఆ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటున్నారు రాశీ ఖన్నా. 2014లో ‘ఊహలు గుసగుసలాడె’ చిత్రంతో కథా నాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారీ బ్యూటీ. 2017లో ‘విలన్’ సినిమా ద్వారా మలయాళంలోకి అడుగుపెట్టారు. తాజాగా ‘భ్రమమ్’ అనే మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ– ‘‘మిగతా భాషల సినిమాలతో పోల్చినప్పుడు మలయాళ సినిమాలు కొంచెం భిన్నంగా ఉంటాయని నా ఫీలింగ్. తెలుగు సినిమాల కోసం తెలుగు నేర్చుకున్నాను. ఆ తర్వాత తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టడంతో ఆ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు మలయాళం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు టంగ్ ట్విస్టర్‌లా అనిపిస్తోంది. మలయాళ పదాలు పలకడం కొంచెం కష్టమే. అయినా నేర్చుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. చదవండి: ఇప్పటిదాకా ప్రేమలో పడలేదు: రాశీఖన్నా టాలీవుడ్‌కు జాన్వీ కపూర్.. డైరెక్టర్ ఎవరంటే! -
సారూ.. కొంచెం నేర్పించరూ!
విశాల్ తెలుగు కుర్రాడు. కానీ, తమిళ్ బాగా మాట్లాడతాడు. ఎందుకంటే, ఉంటున్నది చెన్నైలో కదా. అయినా మాతృభాష అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కదా అందుకే, తమిళంలో తాను చేస్తున్న చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుంటారు. ఇప్పుడీ హీరో మలయాళ భాష నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకంటే, అక్కడ ‘విలన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘సారూ.. కొంచెం మలయాళం నేర్పించరూ’ అంటూ విశాల్ డైరెక్టర్ హెల్ప్ తీసుకుంటున్నారట. మోహన్‌లాల్ లీడ్ రోల్లో బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశాల్ డాక్టర్‌గా యాక్ట్ చేస్తున్నారట. ఇందులో విశాల్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు.