
రజనీకి విలన్ విక్రమే
సూపర్‌స్టార్‌కు ఐ హీరో విలన్‌గా మారబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.
సూపర్‌స్టార్‌కు ఐ హీరో విలన్‌గా మారబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. రజనీకాంత్‌ను ఒక పక్క లింగా సమస్యలు వెంటాడుతుంటే ఆయన చిత్ర యూనిట్ మాత్రం రజనీకి విలన్‌ను వెతికే పనిలో పడింది. సూపర్‌స్టార్ తాజాగా రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. అందులోఒకటి యువ దర్శకుడు, మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ హ్యాండిల్ చేయనున్నారు. ఇదో విభిన్న గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం అంటున్నారు. ఇందులో రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర పోషించనున్నారని సమాచారం.
ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీ ఎందిరన్-2కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. స్టార్ డెరైక్టర్ శంకర్‌కథను వండుతున్న ఈ చిత్రం సుమారు 300 కోట్లు బడ్జెట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కే చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతి నాయకుడిగా నటించే నటుడు విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
తాజాగా నటుడు కమల్‌ను నటింప చేసే ప్రయత్నం ఫలించలేదని, బాలీవుడ్‌బాద్‌షా షారూఖ్‌ఖాన్‌తో సంప్రతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా రజనీకి విక్రమ్‌నే విలన్‌గా మారబోతున్నారనే ప్రచారం వేగంగా సాగుతోంది. ఎందిరన్-2లో రజనీని ఢీకొనే సత్తా ప్రస్తుతం విక్రమ్‌కు ఉంటుందనే అభిప్రాయం. కోలీవుడ్‌లో అధికంగా వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఇంతకుముందు సాధించారన్నది గమనార్హం. పరిశ్రమ నుంచి కూడా సూపర్‌స్టార్‌కు విలన్ విక్రమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుందట.