డైరెక్టర్‌ శంకర్‌ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు | Suriya And Vikram Next Movie With Director Shankar | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ శంకర్‌ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు

Published Fri, Sep 27 2024 12:25 PM | Last Updated on Fri, Sep 27 2024 12:37 PM

Suriya And Vikram Next Movie With Director Shankar

భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ దర్శకుడు శంకర్‌. తాజాగా విడుదలైన ఇండియన్‌– 2 చిత్రం వరకూ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. అయితే ఇటీవల విడుదలై ఇండియన్‌– 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం  స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ సూపర్‌హిట్‌ బాట పట్టడానికి దర్శకుడు శంకర్‌ శ్రమిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

ఈ సినిమా తరువాత ఇండియన్‌– 3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మరో భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్‌ ఉన్నారు. ఏల్పారి నవల హక్కులను పొందిన శంకర్‌ దీన్ని భారీ బడ్జెట్‌లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీన్నీ మల్టీస్టారర్‌ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిసింది. ఆ స్టార్‌ హీరోలెవరో కాదు చియాన్‌ విక్రమ్‌, సూర్య అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. 

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితం నటించిన పితామగన్‌ అనే సంచలన విజయం సాధించింది. కాగా ఇప్పుడు నటుడు విక్రమ్‌, సూర్య కలిసి నటిస్తే వేల్పారి నవల మరో సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement