
అజిత్‌కు విలన్‌గా వివేక్ ఒబెరాయ్
హిందీ ప్రముఖ కథానాయకులు కోలీవుడ్‌లో ప్రతినాయకులుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ 2.ఓ చిత్రంలో సూపర్‌స్టార్‌కు విలన్‌గా మారితే తాజాగా అజిత్‌కు స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా మారనున్నారు. అజిత్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన విలన్‌గా నటించడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. వీరం, వేదాళం తరువాత అజిత్ దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇది.
ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కాజల్‌అగర్వాల్ నాయకీగానూ, కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. వెట్రి చాయాగ్రహణం, అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే బల్గేరి, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో విలన్ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులను సంప్రదించినట్లు తెలిసింది. వారిలో అభిషేక్‌బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ పేర్లు కూడా చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే చివరికి చిత్ర వర్గాలు నటుడు వివేక్ ఒబెరాయ్‌ను అజిత్‌కు విలన్‌గా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వివేక్ ఒబెరాయ్‌కు ఇంతకు ముందు హిందీలోనే కాకుండా తెలుగులోనూ హీరోగా నటించిన అనుభవం ఉంది. అయితే తమిళంలో మాత్రం అజిత్‌కు విలన్‌గానే పరిచయం కానున్నారు. అయితే ఆయన తమిళనాట సునామీ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సేవాకార్యక్రమాలు చేశారన్నది గమనార్హం.