ముంబై: తనను, తన భర్తను ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారని నటి ఊర్మిళ మటోండ్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఊర్మిళ శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసన్ అక్తర్, ఇతర కుటుంబ సభ్యలపై ట్రోలర్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు. తన భర్త మొహిసిన్‌ను పాకిస్తానీ అని ఆయన ఓ టెర్రరిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, అవి మితిమీరితే సహించేది లేదని ట్రోలర్స్‌పై మండిపడ్డారు. అయితే తన భర్త పాకిస్తాన్ ముస్లిమని, ఆయన ముస్లిం కావడమే ట్రోల్స్‌కు ప్రధాన కారణమన్నారు.
అదే విధంగా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారని చెప్పారు. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసిన్ లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక గతంలో కూడా తన వికీపీడియా వివరాలను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఇందులో తన తండ్రి పేరును శివీందర్ సింగ్ అని, తల్లి పేరును రుక్సానా అహ్మద్‌గా మార్చారని తెలిపారు. కానీ తన తల్లిదండ్రుల పేర్లు సునీతా, శ్రీకాంత్ మటోండ్కర్ అని ఊర్మిళ స్పష్టం చేశారు. కాగా ఊర్మిళ-మొహిసిన్‌లు 2016లో సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే ప్రముఖ అతిథిగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment