గచ్చిబౌలి :పండ్లను ముక్కలుగా కోసి అందులో ఐస్ ముక్కలు, షుగర్ వేసి తయారు చేసిన జ్యూస్‌ను మనం తాగే ఉంటాం. కానీ పండ్లను మిషన్‌లో క్రష్ చేసి నీరు, చక్కెర లేకుండా సహజ సిద్ధమైన జ్యూస్‌ను తయారు చేస్తున్నాడీ యువకుడు.నగరంలో ‘ఎన్ కోల్డ్ ప్రెస్ట్’ పేరిట జ్యూస్ తయారు చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు. అశోక్‌గనర్‌కు చెందిన అమితేష్ శర్మ 2012లో బీటెక్ పూర్తి చేశారు. కాలేజ్‌లో వినూత్న రీతిలో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని అక్కడి లెక్చరర్లు ప్రోత్సహించే వారు. బీటెక్ పూర్తి కాగానే 2013లో శివంలో ఫిల్మి తడక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్‌నునడుపుతూ కిచెన్ పండ్లతో వాటర్, షుగర్ కలపకుండా జ్యూస్ చేసి వచ్చే వారికి ఉచితంగా ఇచ్చేవారు. దీనికి మంచి స్పందనరావడంతో 2016లో రెస్టారెంట్ సమీపంలో మరో కిచెన్‌తీసుకొని జ్యూస్ తయారు చేస్తున్నారు.
ఎన్ కోల్డ్ ప్రెస్డ్...
ఎన్ కోల్డ్ ప్రెస్డ్ పేరిట వాటర్, షుగర్ లెస్ జ్యూస్‌ను తయారు చేసే విధానంపై ప్రాజెక్ట్ రిపోర్డ్‌ను తయారు చేసి ఐటీసీలో సీఈఓగా పని చేసిన ప్రదీప్ దోబ్లేను కలిశారు. ఆయన సంతృప్తి వ్యక్తం చేసి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. దీంతో మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఎన్ కోల్డ్ ప్రెస్డ్ స్టార్టప్‌ను నెలకొల్పారు. సీఈఓ, ఫౌండర్‌గా అమితేష్‌తో పాటుమరో ఐదుగురు కలిసి అధ్యయనం చేశారు. నిజాంపేట్‌లో ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించారు. 53 రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారు చేస్తున్నారు. రోజుకు 300 లీటర్ల జ్యూస్ తయారు చేస్తున్నారు. నాలుగైదు రకాల కూరగాయలు, పండ్లు కలిపి జ్యూస్ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జ్యూస్ తయారు చేసిన అనంతరం 6 గంటల పాటు కూలింగ్‌లో ఉంచుతారు. ఉదయం హోమ్ డెలివరీ చేస్తారు. తమ జ్యూస్‌ను సెలబ్రిటీలు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారని అమితేష్ చెబుతున్నారు. త్వరలో వంద మందికి ఉపాధికల్పిస్తామని పేర్కొంటున్నారుఅమితేష్ శర్మ .
చర్లపల్లిలో మరో యూనిట్...
రోజుకు 5000 లీటర్ల జ్యూస్‌ను తయారు చేసేందుకు చర్లపల్లిలో మరో యూనిట్‌ను త్వరలో పెట్టనున్నారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి కేంద్రాన్నినెలకొల్పనున్నారు. – అమితేష్ శర్మ, ఎన్ కోల్డ్ ప్రెస్డ్ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment