Senior Engineer Molestation On Aero Technic Trainee Girl In Hyderabad - Sakshi
Sakshi News home page

శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన

Published Thu, Dec 16 2021 9:14 AM | Last Updated on Thu, Dec 16 2021 1:39 PM

Senior Engineer Molestation On Aero Technic Trainee Girl  In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శంషాబాద్‌(హైదరాబాద్‌): ఎయిరోటెక్నిక్‌లో శిక్షణ పొందుతున్న యువతితో ఇంజినీర్లు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..మహారాష్ట్ర ముంబాయికి చెందిన ఓ యువతి(25) మామిడిపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటోంది. ఎయిర్‌పోర్టులో ఎరోటెక్నిక్‌ కోర్సులో కొంతకాలంగా శిక్షణ తీసుకుంటోంది.

అదే విభాగంలో సీనియర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వెంకట్, ఫళనిస్వామి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సదరు యువతి బుధవారం ఉదయం పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన కావడంతో వారు మహిళా పోలీసుల సహాయంతో ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: మాజీ మంత్రికి ఝలక్‌.. 69 చోట్ల విజిలెన్స్‌ సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement