
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం) ఆవిష్కరణకు సిద్ధమైంది. అక్టోబర్ 31న పటేల్ 143 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు.