హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ 24]7.ఏఐ భారీ నియామకాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5,000ల పైచిలుకు మందిని కొత్తగా చేర్చుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 1,500 మందిని హైదరాబాద్ కేంద్రం కోసం నియమిస్తామని కంపెనీ ఎస్‌వీపీ నీనా నాయర్ తెలిపారు. ఇప్పటికే భాగ్యనగరి కేంద్రంలో 2,000 మంది పనిచేస్తున్నారు.
సేల్స్, కస్టమర్ సర్వీస్, టెక్ సపోర్ట్ విభాగాల్లో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. టెలికం, రిటైల్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలో ఉన్న గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలకు సేవలు అందిస్తున్నారని కంపెనీ తెలిపింది. ఇక 80 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సంస్థకు బెంగళూరుతోపాటు ఇతర దేశాల్లో మరో అయిదు కార్యాలయాలు ఉన్నాయి.
చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment