ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్‌ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.
‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?
యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్‌ఎల్‌ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్‌డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment