న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రయత్నాలు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పా రు. ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్.... ఇలా పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఐదే ళ్లలో కోల్ ఇండియా ఉత్పత్తిని రెట్టింపు (వంద కోట్ల టన్నులకు) చేయాలని ప్రభుత్వం భావిస్తోం దని, దీని కోసం దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని వివరించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీగా పేరు గాంచిన కోల్ ఇండియాలో ఇప్పటికే మూడు లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశీయ ఉత్పత్తిలో ఈ కంపెనీ వాటా 80%. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తన వార్షిక ఉత్పత్తి (46.2 కోట్ల టన్నులు) లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50.7 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధింవచ్చు.
కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ కొలువులు
Published Mon, Jan 5 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement