executives posts
-
తగ్గదేలే: పురుషులకు సమానంగా,రూ.100లో రూ.85 మహిళలే సంపాదిస్తున్నారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మనదేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ►ఇక్రా చైర్పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్ప్రొఫెసర్ ప్రొమిలా అగర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్ఎస్ఈ 200 కంపెనీస్ పేరిట సర్వే నిర్వహించారు. ►గతేడాది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులలో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది. ►సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో నమోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది. ►200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది. ►మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ►నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండగా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది. -
జియోలో వేలకొద్దీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోబోతోంది. పలు విభాగాల్లో వీరిని రిక్రూట్ చేసుకోవాలని జియో భావిస్తోంది. రిలయన్స్ జియో వెబ్సైట్ జియో.కామ్‌లోని జాబ్ లిస్టింగ్స్‌లో ‘జియోగ్రాఫికల్ జాబ్స్’ కేటగిరీ కింద సుమారు 2437 ఓపెనింగ్స్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్టు పేర్కొంది. ఈ కేటగిరీ కింద ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 925 స్థానాలకు, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లో 726 స్థానాలకు, ఆపరేషన్స్‌లో 182 స్థానాలకు, సప్లయ్ చైనాలో 109 స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు రిపోర్టులు తెలిపాయి. అంతేకాక ‘పాయింట్ జాబ్స్’ కోసం కూడా 585 మందిని నియమించుకోబోతోంది. ఈ జియో పాయింట్ టీమ్, చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో జియో పాయింట్లను లాంచ్ చేయడం కోసం పనిచేయనున్నాయి. కస్టమర్ సేల్స్ అండ్ సర్వీసు టచ్ పాయింట్లను ఇవి ఆపరేట్ చేయనున్నాయి. ఇలా సుమారు 3000 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని జియో భావిస్తోంది. టెలికాం మార్కెట్ల మధ్య ఏర్పడుతున్న తీవ్రమైన పోటీ కర వాతావరణ నేపథ్యంలో, జియో దూకుడుగా ఉందని విశ్లేషకులు చెప్పారు. తన డిస్కౌంట్లు, ఉచిత వాయిస్ ఆఫర్స్‌తో టెలికాం మార్కెట్లో ఈ కంపెనీ సంచలనాలు సృష్టిస్తోంది. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ కొలువులు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రయత్నాలు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పా రు. ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్.... ఇలా పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఐదే ళ్లలో కోల్ ఇండియా ఉత్పత్తిని రెట్టింపు (వంద కోట్ల టన్నులకు) చేయాలని ప్రభుత్వం భావిస్తోం దని, దీని కోసం దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీగా పేరు గాంచిన కోల్ ఇండియాలో ఇప్పటికే మూడు లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశీయ ఉత్పత్తిలో ఈ కంపెనీ వాటా 80%. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తన వార్షిక ఉత్పత్తి (46.2 కోట్ల టన్నులు) లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50.7 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధింవచ్చు.