టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోబోతోంది. పలు విభాగాల్లో వీరిని రిక్రూట్ చేసుకోవాలని జియో భావిస్తోంది. రిలయన్స్ జియో వెబ్‌సైట్ జియో.కామ్‌లోని జాబ్ లిస్టింగ్స్‌లో ‘జియోగ్రాఫికల్ జాబ్స్’ కేటగిరీ కింద సుమారు 2437 ఓపెనింగ్స్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్టు పేర్కొంది. ఈ కేటగిరీ కింద ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 925 స్థానాలకు, సేల్స్, డిస్ట్రిబ్యూషన్‌లో 726 స్థానాలకు, ఆపరేషన్స్‌లో 182 స్థానాలకు, సప్లయ్ చైనాలో 109 స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు రిపోర్టులు తెలిపాయి.
అంతేకాక ‘పాయింట్ జాబ్స్’ కోసం కూడా 585 మందిని నియమించుకోబోతోంది. ఈ జియో పాయింట్ టీమ్, చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో జియో పాయింట్లను లాంచ్ చేయడం కోసం పనిచేయనున్నాయి. కస్టమర్ సేల్స్ అండ్ సర్వీసు టచ్ పాయింట్లను ఇవి ఆపరేట్ చేయనున్నాయి. ఇలా సుమారు 3000 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని జియో భావిస్తోంది. టెలికాం మార్కెట్ల మధ్య ఏర్పడుతున్న తీవ్రమైన పోటీ కర వాతావరణ నేపథ్యంలో, జియో దూకుడుగా ఉందని విశ్లేషకులు చెప్పారు. తన డిస్కౌంట్లు, ఉచిత వాయిస్ ఆఫర్స్‌తో టెలికాం మార్కెట్‌లో ఈ కంపెనీ సంచలనాలు సృష్టిస్తోంది. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment