
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారతీయ ఇంజనీర్లకు శుభవార్త అందించింది. దాదాపు వెయ్యిమంది ఇంజనీర్లను ఏడాది ఎంపిక చేయనున్నామని ప్రకటించింది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్ చేస్తామని, ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నతమ ఆర్ అండ్ డీ సెంటర్ల కోసం ఈ ఇంజనీర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయో మోట్రిక్స్, అగ్‌మెంటెడ్ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన‍్లలో వీరిని నియమించుకుంటుంది.
దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల కోసం ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం బుధవారం ప్రకటించింది. వీరిలో 300మందిని ఐఐటీలనుంచి నియమించుకుంటామని వెల్లడించింది. అలాగే ఐఐటీ,, ఎన్‌ఐటీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, పిట్స్ పిలానీ, మణిపాల్ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,ఎండీ బెంగళూరు దీపేష్ షా వెల్లడించారు. ప్రతిభకు పెద్ద పీట వేస్తామనన్నారాయన. సాం ప్రదాయికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్ ఇంజనీరింగ్, మాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అప్లైడ్ మెషీన్స్ అండ్ స్టాటస్టిక్స్ లాంటి ఇతర కోర్సుల వారిని కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో ఆర్ అండ్ డి సెంటర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment