R&D jobs
-
ఆ టెకీలకు గుడ్‌న్యూస్..
సాక్షి, బెంగళూర్ : దిగ్గజ కంపెనీలకు చెందిన ఇంజనీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో అధిక వేతన పెంపు, నియామకాల జోరు ఊపందుకుంటుందని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ తాజా అథ్యయనంలో వెల్లడైంది. టెక్నాలజీ రంగంలో గత ఏడాది హైరింగ్ 29 శాతం పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ఎంఎన్సీలకు చెందిన 43 గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లలో (జీఐసీ) ఈ అథ్యయనం చేపట్టారు. దేశంలో 1200 ఆర్అండ్డీ, ఇంజనీరింగ్ సెంటర్లతో 950 ఎంఎన్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 5 నుంచి 10 శాతం మేరకు పెరుగుతోంది. జీఐసీలో హైరింగ్ ఐటీ నియామకాల కంటే అధికంగా ఉండటం గమనార్హం. 2017లో జీఐసీల్లో వేతన పెంపు భారత ఐటీ కంపెనీల వేతన పెంపు కంటే రెండు రెట్లు అధికమని అథ్యయనంలో వెల్లడైంది. జీఐసీల్లో సగటు వేతన పెంపు 11.2 శాతంగా నమోదైంది. జూనియర్ లెవెల్లో అత్యధికంగా 14 శాతం వరకూ వేతనాలు పెరిగాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి నూతన డిజిటల్ టెక్నాలజీల రాకతో బహుళజాతి సంస్థలు తమ ఇంజనీరింగ్ విభాగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం, నూతన సొల్యూషన్లపై దృష్టిసారించడంతో ఆయా విభాగాల్లో నియామకాలు పెరిగాయని జిన్నోవ్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ హెడ్ ఆనంద్ సుబ్రమణియమ్ చెప్పారు. మరోవైపు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగాల్లో హైరింగ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. 2017లో ఆర్అండ్డీలో 30.6 శాతం మేర హైరింగ్ వృద్ధి నమోదైందని చెప్పారు. -
శాంసంగ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారతీయ ఇంజనీర్లకు శుభవార్త అందించింది. దాదాపు వెయ్యిమంది ఇంజనీర్లను ఏడాది ఎంపిక చేయనున్నామని ప్రకటించింది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్ చేస్తామని, ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నతమ ఆర్ అండ్ డీ సెంటర్ల కోసం ఈ ఇంజనీర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయో మోట్రిక్స్, అగ్మెంటెడ్ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన్లలో వీరిని నియమించుకుంటుంది. దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల కోసం ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం బుధవారం ప్రకటించింది. వీరిలో 300మందిని ఐఐటీలనుంచి నియమించుకుంటామని వెల్లడించింది. అలాగే ఐఐటీ,, ఎన్ఐటీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, పిట్స్ పిలానీ, మణిపాల్ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,ఎండీ బెంగళూరు దీపేష్ షా వెల్లడించారు. ప్రతిభకు పెద్ద పీట వేస్తామనన్నారాయన. సాం ప్రదాయికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్ ఇంజనీరింగ్, మాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అప్లైడ్ మెషీన్స్ అండ్ స్టాటస్టిక్స్ లాంటి ఇతర కోర్సుల వారిని కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో ఆర్ అండ్ డి సెంటర్లు ఉన్నాయి. -
ఎంఎన్సీ ఆర్అండ్డీ కేంద్రాల్లో వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: భారత్‌లోని ఎంఎన్సీల ఆర్ అండ్ డీ సెంటర్లకు సంబంధించి కొత్త ఉద్యోగాలు, ఆట్రీషన్, వేతనాల పెంపు వంటి అంశాలు ఆశావహంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ ఈ విషయాల్లో సానుకూల ధోరణే ఉందని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ పేర్కొంది. భారత్‌లో ఎంఎన్సీల ఆర్ అండ్ డీ సెంటర్లు 1,031 ఉన్నాయని, వీటి వృద్ధి ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, అలాగే 2,44,000 మంది ఉద్యోగులున్నారని, ఈ ఉద్యోగాలు ఏటా 11 శాతం పెరుగుతున్నాయని తెలిపింది. ఈ ఆర్ అండ్ డీ సెంటర్లలో ఈ ఏడాది ఆట్రీషన్ 9 శాతం, హైరింగ్ 20 శాతం, వేతనాల పెంపు 12 శాతం చొప్పున ఉంటుందని అంచనా.