హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు | CGS to hire 100 employees for Hyderabad centre | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు

Published Fri, Aug 19 2016 12:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు

హైదరాబాద్: అమెరికాకు చెందిన  కంప్యూటర్ జెనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్)  హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. లెర్నింగ్ అండ్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే క్రమంలో  సిలికాన్ వ్యాలీ మాదాపూర్ లో తన కార్యాలయాన్ని  ఏర్పాటు చేసింది. ఈ కొత్త కార్యాలయంలో 163 మంది ఉద్యోగులు వరకు అవకాశం కల్పించే సామర్థ్యం ఉందని పేర్కొంది.  ఈ సంత్సరాంతానికి 50శాతంవరకు ఉద్యోగ వృద్ధి ఉండనుందని అంచనావేస్తోంది. రాబోయే 18 నెలల్లో  100 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు   యోచిస్తున్నట్టు  సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

హైదరాబాద్ లో కొత్త ఆఫీసు సాఫ్ట్వేర్  డెవలప్మెంట్  అండ్ సపోర్టు  కోసం కొత్త ఉత్పత్తులను జోడిస్తుందని ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బ్లూ బెర్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కు  అప్లికేషన్ అభివృద్ధి,  నిర్వహణ మరియు సాఫ్ట్వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ సేవలు అందిస్తోందని తెలిపారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా 7,500 నిపుణులైన ఉద్యోగులను కలిగి వున్న  సంస్థ, భారతదేశంలో ఉన్న  కేంద్రాల్లో సుమారు 100 మంది ఉద్యోగులను నియమించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement