CGS
-
హైదరాబాద్‌లో సీజీఎస్ నూతన కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సాంకేతిక రంగ కంపెనీ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్) హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిన్నరలో 800 మందికి, ఐదేళ్లలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్ తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (సీఎస్‌ఓఎస్)ను కూడా నెలకొల్పుతామని.. ఇందులో ఆగ్యుమేటెడ్ రియాలిటీ (ఏఐ) ఆధారిత సేవలందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయిల్ రీఫ్‌మన్, సీజీఎస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్, సీజీఎస్ ఇండియా ఎండీ జీతు భట్టు గురువారం సీజీఎస్ హైదరాబాద్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్ నుంచి మా కస్టమర్లకు ఆర్ అండ్ డీ, అప్లికేషన్ డెవలప్మెంట్, కస్టమర్‌కేర్ సెంటర్ సేవలను అందిస్తున్నామని, మైక్రో సాఫ్ట్, ఐబీఎం, డెల్, ఏటీఅండ్‌టీ, అవయ, తోషిబా, రెమాండ్స్ వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని టాప్ టెక్నాలజీ కంపెనీ కాల్‌సెంటర్‌ను ఈ సెంటర్ నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజీఎస్ గ్లోబల్‌కు యూఎ స్, యూకే, కెనడా, ఇజ్రాయిల్, రొమానియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. 45 దేశాల్లో ఫ్యాషన్, అపెరల్, ఈ– కామర్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి పరిశ్రమలకు ఎంటర్ప్రైజెస్ సొల్యూ షన్స్‌ను అందిస్తుంది. ప్రస్తు తం 8 వేల మంది ఉద్యోగులన్నారని.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 వేల మందికి చేరుకుంటామని తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి సోమాజిగూడ: పర్యావరణ పరిరక్షణకు అటుప్రభుత్వాలు..ఇటు పౌరసమాజం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి బాధ్యతగా గుర్తించాలని పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటేలా ఆచరణీయమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఎస్ ) ఆధ్వర్యంలో బేగంపేట సెస్ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఎర్త్‌డే, 7 వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగరికత పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం దెబ్బతిందన్నారు. పంచభూతాల మయమైన సృష్టిలో ఇప్పటికే గాలి, నీరు, భూమి కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డమైన విధానాలు, ఆచరణీయమైన దృక్పథం లేకపోవడం, మానవ స్వార్థం మరింత చేటు చేస్తున్నాయన్నారు. ఒక సృష్టమైన విధానంతో ముందుకు వెళ్తేనే మనుగడ సాధ్యమన్నారు. పర్యావరణం, మెక్కల పెంపకం, తూర్పు కనుమల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్న సీజీఎస్ సంస్థను అభినందించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఇల్లు, నీరు అడుగుతారని, దాంతో పాటు మెక్కలు కూడా పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ సంస్థ గత ఏడేళ్లుగా చేస్తున్న సేవలను అభినందించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష మెక్కల పెంపకం లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారభమైన సీజీఎస్ సంస్థ నేడు లక్షలాది మొక్కలు పెంచే స్థాయికి చేరుకోవడంతో పాటు దాదాపు 1700 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణ, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత రాష్ట్రాల ఎంపీలు, అధికారులు, సంస్థల మద్దతు కూడా కూడగట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి ప్రత్యేక అవార్డులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి సీజీఆర్ ఫౌండేషన్ లెక్చర్ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి గత ఏడేళ్ల ప్రగతిని వివరించారు. పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి సంస్థతో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ సమస్యలపై స్పందిస్తున్న వందేమాతరం ఫౌండేషన్, కళాకారుడు లెనిన్‌బాబు, నాగర్‌కర్నూల్ జిల్లా సిలార్పల్లిని గ్రీన్విలేజ్గా తీర్చిదిద్దిన యువకులు, రైతు నీలాలక్ష్మి, ఎన్జీవో సత్యశ్రీ, నెక్కొండలోని యూపీఎస్ స్కూల్, డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ సుధాకర్‌రెడ్డి , విద్యార్థి రమేష్‌లను సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రియులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కొలువులు
హైదరాబాద్: అమెరికాకు చెందిన కంప్యూటర్ జెనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్) హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. లెర్నింగ్ అండ్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే క్రమంలో సిలికాన్ వ్యాలీ మాదాపూర్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త కార్యాలయంలో 163 మంది ఉద్యోగులు వరకు అవకాశం కల్పించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ఈ సంత్సరాంతానికి 50శాతంవరకు ఉద్యోగ వృద్ధి ఉండనుందని అంచనావేస్తోంది. రాబోయే 18 నెలల్లో 100 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు యోచిస్తున్నట్టు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ లో కొత్త ఆఫీసు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సపోర్టు కోసం కొత్త ఉత్పత్తులను జోడిస్తుందని ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బ్లూ బెర్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కు అప్లికేషన్ అభివృద్ధి, నిర్వహణ మరియు సాఫ్ట్వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ సేవలు అందిస్తోందని తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 7,500 నిపుణులైన ఉద్యోగులను కలిగి వున్న సంస్థ, భారతదేశంలో ఉన్న కేంద్రాల్లో సుమారు 100 మంది ఉద్యోగులను నియమించుకుంది.