ముంబై: తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీలు ఈ ఏడాది(2022–23) చివరి త్రైమాసికంలో ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ4)లో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ పేరిట టీమ్‌లీజ్ విడుదల చేసిన సర్వే తెలియజేసింది.
భారీస్థాయి కంపెనీలు 69 శాతం, మధ్యస్థాయి సంస్థలు 44 శాతం, చిన్నతరహా బిజినెస్‌లు 39 శాతం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వివరించింది. సర్వేకు దేశవ్యాప్తంగా 14 నగరాల నుంచి తయారీ రంగంలోని 301 కంపెనీలను పరిగణించినట్లు తెలియజేసింది. 60 శాతానికిపైగా యాజమాన్యాలు తమ మానవ వనరులను విస్తరించే యోచనలో ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఇక తయారీ, సర్వీసుల రంగాల ఉపాధి ప్రణాళికలు సంయుక్తంగా 68 శాతానికి బలపడినట్లు తెలియజేసింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఇది 65 శాతమేనని ప్రస్తావించింది. ఉపాధి కల్పనా ప్రణాళికల జాబితాలో ముంబై(97 శాతం), బెంగళూరు(94 శాతం), చెన్నై(89 శాతం), ఢిల్లీ(84 శాతం), పుణే(73 శాతం) ముందున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment