2018 కల్లా మరో 700 మంది నియామకం | 700 employes hired in 2018 :pega systems | Sakshi
Sakshi News home page

2018 కల్లా మరో 700 మంది నియామకం

Published Tue, Jun 7 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

2018 కల్లా మరో 700 మంది నియామకం

2018 కల్లా మరో 700 మంది నియామకం

పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న పెగాసిస్టమ్స్ ఇండియా 2018 చివరినాటికి మరో 700 మంది నిపుణులను నియమించుకోనుంది. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో హైదరాబాద్, బెంగళూరులో కేంద్రాలున్నాయి. పరిశోధన, అభివృద్ధితోపాటు ఆవిష్కరణలన్నీ ఈ సెంటర్లలోనే కేంద్రీకృతమయ్యాయి. 1,300 మందికిపైగా నిపుణులు పనిచేస్తున్నారని పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్ రెడ్డి ఈదునూరి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.

హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 2,000 మంది సిబ్బంది కూర్చునే వీలుందని చెప్పారు. ఫార్చూన్-500 కంపెనీల్లో 60 శాతందాకా కంపెనీలు పెగాసిస్టమ్స్‌కు క్లయింట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫార్చూన్-3,000 కంపెనీలను తమ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. లాస్‌వెగాస్‌లో జరుగుతున్న పెగావరల్డ్ సదస్సుకు అనుబంధంగా హైదరాబాద్‌లో సైతం కంపెనీ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement