టెక్నో స్మార్ట్ ఫోన్ కంపెనీ మనదేశంలో పోవా అనే కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో మొదటి ఫోన్ అయిన టెక్నో పోవా గేమింగ్ ఫోన్‌గా రానుంది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 4న భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. టెక్నో పోవా మూడు రంగులలో లభిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ(రూ.10,800)గా ఉండనున్నట్లు సమాచారం. (చదవండి: డిసెంబర్ లో లాంచ్ కానున్న వివో వీ20 ప్రో)
టెక్నో పోవా ఫీచర్స్
ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డాట్-ఇన్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. టెక్నో పోవాలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. దీంతో పాటు మరో ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment