Security Lapses In Mediatek Audio Chips, Allows Hackers To Listen Phone Conversations - Sakshi
Sakshi News home page

Mediatek Audio Chips: మీరు ఈ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్‌ డేటా హ్యకర్ల చేతిలోకి..!

Published Thu, Nov 25 2021 5:12 PM | Last Updated on Thu, Nov 25 2021 9:00 PM

Security Lapses In Mediatek Chips Allow Hackers To Listen To Calls - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్వాలకమ్‌, మీడియాటెక్‌, హెలియో ప్రాసెసర్లను పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్‌ ప్రాసెసర్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంచలన విషయాలను వెల్లడించింది.
చదవండి: మెటావర్స్‌తో ముప్పు! అంతకు మించి..

మీ కాల్స్‌ను మూడో వ్యక్తి వినగలరు..!
మీడియాటెక్‌ ప్రాసెసర్స్‌తో నడిచే స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్ల కాల్స్‌ను మూడో వ్యక్తి వినే అవకాశం ఉన్నట్లు చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక ప్రకారం.... మీడియాటెక్ చిప్ ఆడియో ప్రాసెసర్‌లో అనేక దుర్బలత్వాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకవేళ వీటిని రెక్టిఫై చేయకుండా వదిలేస్తే హ్యాకర్లు సులభంగా వారి సంభాషణలు వినే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాటెక్‌ ప్రాసెసర్లను ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు షావోమీ, ఒప్పో, రియల్‌మీ,వివో లాంటి కంపెనీలు వాడుతున్నాయి.  

పరిష్కరించిన మీడియాటెక్‌..!
చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించిన లోపాలపై మీడియాటెక్‌ స్పందించింది. పలు ప్రాసెసర్లలో లోపాలు ఉన్నది వాస్తవమైనప్పటికీ, ఈ లోపాల సహాయంతో ఇప్పటివరకు ఎలాంటి డేటా చౌర్యం జరిగిందనే రుజువులేదని మీడియా టెక్‌ భద్రత అధికారి టైగర్‌ హుజ్‌ వెల్లడించారు. ఆయా లోపాలను కంపెనీ వెంటనే గుర్తించి, పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఆయా స్మార్ట్‌ఫోన్ల యూజర్లు కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌కి అప్‌డేట్‌ చేయాలని పేర్కొంది. వాటితో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. CVE-2021-0661, CVE-2021-0662, CVE-2021-0663గా గుర్తించబడిన లోపాలను కంపెనీ పరిష్కరించిందని మీడియాటెక్ తన సెక్యూరిటీ బులెటిన్‌లో ప్రచురించింది. 
చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్‌ నుంచి పవర్‌ఫుల్‌  ప్రాసెసర్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement