OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్​లోకి వన్‌ప్లస్ నార్డ్ 2 | OnePlus Nord 2 Confirmed To Launch in India Soon | Sakshi
Sakshi News home page

OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్​లోకి వన్‌ప్లస్ నార్డ్ 2

Published Thu, Jul 8 2021 4:11 PM | Last Updated on Thu, Jul 8 2021 4:11 PM

OnePlus Nord 2 Confirmed To Launch in India Soon - Sakshi

వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక టీజర్లో ధృవీకరించింది. వన్‌ప్లస్‌ నార్డ్ 2పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. తాజాగా కంపెనీ నార్డ్ 2 గురించి అధికారిక వివరాలను టీజ్ చేసింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. కంపెనీ వన్‌ప్లస్‌ నార్డ్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో రావచ్చని సమాచారం. భారతీయ కస్టమర్ల కోసం వన్‌ప్లస్‌, మీడియాటెక్ తో జతకట్టినట్లు కంపెనీ తెలిపింది. మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ గా వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ నిలవనుంది. గతంలో వన్​ప్లస్​ ఏ మోడల్​లో వాడని అడ్వాన్స్‌డ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(AI) టెక్నాలజీని దీనిలో ఉపయోగించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2లో AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ అనే ఫీచర్​ను చేర్చనుంది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు అదే బ్రైట్ నెస్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది.

ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ కనెక్టివిటీ సపోర్ట్​తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్​ప్లే తీసుకు రానున్నారు. ఈ డిస్​ప్లే ఓఎల్‌ఇడీ టెక్నాలజీ, ఫుల్​ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్​ కలిగి ఉంది. ఇక, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్‌ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్​లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement