జులై 22న వచ్చేస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే! | OnePlus Nord 2 Smart Phone launch on July 22 | Sakshi
Sakshi News home page

జులై 22న వచ్చేస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే!

Published Sun, Jul 11 2021 9:05 PM | Last Updated on Sun, Jul 11 2021 9:06 PM

OnePlus Nord 2 Smart Phone launch on July 22 - Sakshi

ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్‌ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్‌ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా):

  • 6.43 అంగుళాల ఫుల్​ హెచ్‌డి ప్లస్ డిస్​ప్లే
  • మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 12 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
  • 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement