ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్‍లో తన పవర్‌ఫుల్ మొబైల్‍ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం.
మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్‍డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది.
ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
(ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!)
కొత్త పోకో ఎఫ్5 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్‍లో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment