Latest Android
-
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్‌లో తన పవర్ఫుల్ మొబైల్‌ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) కొత్త పోకో ఎఫ్5 మొబైల్లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్లో ఉంటాయి. -
రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ పవర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫీనియం జెడ్50 నోవాను దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీడియోకాన్ ఇటీవల విడుదల చేసింది. అయిదు అంగుళాల స్క్రీన్ కలిగిఉన్న ఈ ఫోన్ ధర రూ.5,999లు మాత్రమే. మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 1.3 గిగాహెర్ట్జ్ కాగా, ర్యామ్ ఒక జీబీగా ఉంది. అంతేకాదు.. ఎనిమిది జీబీలు ఉన్న మెమరీని మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. రెండు సిమ్‌లను సపోర్ట్ చేసే ఇన్ఫీనియం జెడ్ 50 నోవాలో 8, 2 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్లున్న కెమెరాలు ఉపయోగించారు. ఆంటీవైరస్, జీపీఎస్ ఆధారిత వ్యక్తిగత భద్రత అప్లికేషన్ వీసెక్యూర్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా హంగామా, గేమ్‌లాఫ్ట్ వంటి సైట్లకు 90 రోజుల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. బ్లూటూత్ 4.0, వైఫై, మిరాకాస్ట్ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌పై శ్రద్ధ ఉన్నవారికి మెరుగైన అవకాశమనే చెప్పాలి. -
కొత్త సరుకు
కిట్‌క్యాట్‌తో శామ్సంగ్ స్టార్-2 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే మరో స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘స్టార్-2’ ప్లస్‌గా పిలుస్తున్న ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర రూ.7335. గెలాక్సీ స్టార్-2 అప్‌గ్రేడ్ మాదిరిగా లభిస్తున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ కలిగి ఉంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ (డ్యుయెల్‌కోర్) కాగా, ర్యామ్ 512 ఎంబీ. ప్రధాన కెమెరా సామర్థ్యం మూడు మెగాపిక్సెళ్లు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా ఏదీ దీంట్లో లేదు. ఫోన్ మెమరీ నాలుగు జీబీలైనప్పటికీ మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. సెల్కాన్ మిలీనియం వోగ్.. కేవలం 7.9 మిల్లీమీటర్ల మందం... 1.2 క్వాడ్‌కోర్ ప్రాసెసర్.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్‌క్యాట్.. ఇవీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెల్కాన్ కంపెనీ తాజాగా విడుదల చేసిన మిలీనియం వోగ్ క్యూ455 స్మార్ట్‌ఫోన్ విశేషాలు. మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో-ఈ ఫీచర్లను పోలిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ 16 జీబీల ఇంటర్నల్ మెమరీ. ఎస్డీ కార్డు ద్వారా దీన్ని 64 జీబీల వరకూ పెంచుకోగలగడం మరో విశేషం. ఫొటోల కోసం 8 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్. ధర రూ.7999. ఓబీ ఆక్టోపస్ ఎస్ 520 ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో జాన్ స్కలీ స్థాపించిన కొత్త కంపెనీ ఒబీ తాజాగా భారత మార్కెట్లో అక్టోపస్ ఎస్ 520 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే... ఆక్టోపస్ ఎ520 దాదాపు 5 అంగుళాల స్క్రీన్, 1280 బై 720 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంది. ఒక సాధారణ సిమ్, ఒక మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేయగలదు. కిట్‌క్యాట్‌తో నడుస్తున్నప్పటికీ వన్ జీబీ వరకూ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల మల్టీటాస్కింగ్ మరింత వేగంగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది గిగాబైట్ల ఇంటర్నర్ మెమరీని ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. రెజల్యూషన్ 8 ఎంపీ. ఫ్రంట్ కెమెరా 2 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రాక్సిమిటీ, ఆక్సెలరోమీటర్ సెన్సర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. దీంతో నాలుగు గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ అంటోంది.