పోకో ఎక్స్6 సిరీస్‌ ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్‌.. భారత్‌లో విడుదల ఎప్పుడంటే | Poco X6 Series Launch In India | Sakshi
Sakshi News home page

పోకో ఎక్స్6 సిరీస్‌ ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్‌.. భారత్‌లో విడుదల ఎప్పుడంటే

Published Mon, Nov 6 2023 9:32 PM | Last Updated on Mon, Nov 6 2023 9:38 PM

Poco X6 Series Launch In India - Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో లేటెస్ట్‌ సిరీస్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ప్రియుల్ని అలరించనుంది. త్వరలో భారత్ మార్కెట్‌లోకి పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనుంది. 

గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించిన పోకో ఎక్స్5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా పోకో ఎక్స్‌6 ను విడుదల చేస్తుంది. అయితే రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. 

పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ - 8జీబీ- 12 జీబీ ర్యామ్, 128 జీబీ /256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్‌వోపీ చిప్ సెట్‌ పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూస్‌బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement