చైనా మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో రాబోతున్న పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. పోకో ఎక్స్3 ప్రో ధర, స్టోరేజ్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5200ఎంఏహెచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టిప్ స్టర్ సుధాంశు అంభోర్ ట్వీటర్ ద్వారా లీక్ చేశారు.
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 250 యూరోలుగానూ(సుమారు రూ.21,600), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 300 యూరోలుగానూ(సుమారు రూ.26,000) ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను తీసుకోని రానున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ ఫీచర్లు ఉండనున్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో ఈ ఫోన్ రానుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ఈ ఫోన్ త్వరలో రానుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment