
పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. పోకో ఎక్స్3 ప్రో తదుపరి సేల్ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999. మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.16,500 విలువచేయాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఒకవేళ పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను డైరెక్ట్‌గా సేల్ లో కొనాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment