న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇటీవలే ఎం3 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో లాంచ్ అయిన పోకో ఎం2కి తర్వాతి వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 9న ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొచ్చిన ఫస్ట్ సేల్‌లో 1.5 లక్షల యూనిట్లు అమ్ముడపోయినట్లు పోకో ప్రకటించింది. మొదటి నుంచి దీని మీద చాలా హైప్ ఉండటం చేత ఇంతగా సేల్ జరిగింది. దాదాపు 30లక్షల మంది వినియోగదారులు ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి కనబరిచినట్లు పోకో పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా దాదాపు రూ.165 కోట్ల బిజినెస్ జరిగింది. ఫిబ్రవరి 16న ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సేల్ కి రానుంది.
పోకో ఎం3 ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్
బ్యాటరీ: 6,000 ఎమ్ఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 18వాట్ ఫాస్ట్ చార్జింగ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662
బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10
కలర్స్: పవర్ బ్లాక్, కూల్ బ్లూ, యెల్లో
ధర: రూ.10,999(6జీబీ, 64జీబీ)
రూ.11,999(6జీబీ, 128జీబీ)
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment