ఫిబ్రవరి 24న రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ లాంచ్ | Realme Narzo 30 Pro 5G and Realme Narzo 30A Launch on February 24 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 24న రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ లాంచ్

Published Thu, Feb 18 2021 8:31 PM | Last Updated on Thu, Feb 18 2021 9:49 PM

Realme Narzo 30 Pro 5G and Realme Narzo 30A Launch on February 24 - Sakshi

రియల్‌మీ ప్రియులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ విడుదల తేదీలను సంస్థ ప్రకటించింది. దీనితో పాటు రియల్‌మీ నార్జో 30ఎ, రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ 2లను కూడా ఫిబ్రవరి 24న సంస్థ భారతదేశంలో విడుదల చేయనుంది. రియల్‌మీ గతేడాది రియల్‌మీ నార్జో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు వాటికీ కొనసాగింపుగా రియల్‌మీ నార్జో 30ఏ, రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ ఫోన్లను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంది. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా అదే రోజు విడుదల కానుంది.

ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ వీటి కోసం ఒక ప్రత్యేక పేజీని కూడా సృష్టించింది. రాబోయే రెండు ఫోన్‌ల డిజైన్ వివరాలతో పాటు రియల్‌మీ నార్జో 30ప్రో 5జీ ప్రాసెసర్ సమాచారం కూడా వెల్లడించింది. రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొనిరావచ్చు అని సమాచారం. ఇక రియల్‌మీ నార్జో 30ఏ, రియల్‌మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలియాలంటే ఫిబ్రవరి 24న రిలీజ్ వరకు ఆగాల్సిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement