పోకో ఎఫ్1 మొబైల్.. ఇండియన్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. ఏదైనా ఒక ఫోన్ విడుదల అయితే 6నెలల తర్వాత ఔట్ డేట్ గా మారిపోతుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం విడుదలైనప్పటి నుంచి ఒక ఏడాది పాటు దాని హవా కొనసాగింది. అంత బాగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం ప్రీమియం మొబైల్స్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకోనిరావడమే. 2018లో విడుదలైన పోకో ఎఫ్1 మొబైల్లో అప్పటి ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. దీనిని కేవలం రూ.20వేలకే అందుబాటులో ఉంచడంతో చాలా మంది ఎగబడి కొన్నారు.
అంతలా సక్సెస్ అయిన ఈ మొబైల్ కి కొనసాగింపుగా పోకో ఎఫ్2ను తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని అందుబాటులోకి తీసుకొనిరాలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి తీసుకోని రానున్నట్లు సమాచారం. ఇటీవలే పోకో ఇండియన్ డైరెక్టర్ అనుజ్ శర్మ, క్వాల్‌కామ్ ప్రాసెసర్ ప్రతినిధితో ట్విటర్ లో మాట్లాడిన వీడియోలో త్వరలో మరో కొత్త మొబైల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఆ రాబోయే మొబైల్ పోకో ఎఫ్2 కావచ్చు అని చాలా మంది నిపుణలు భావిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్/875 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చని అంచనా. పోకో ఎఫ్2 లీకైన స్పెక్స్‌లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. పోకో ఎఫ్2 5జీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానుంది. ఇది రూ.25వేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. (చదవండి: టెస్లాకు పోటీగా మరో ఎలక్ట్రిక్ కారు)
Comments
Please login to add a commentAdd a comment