Poco F1
-
పోకో ప్రియులకు శుభవార్త!
పోకో ఎఫ్1 మొబైల్.. ఇండియన్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. ఏదైనా ఒక ఫోన్ విడుదల అయితే 6నెలల తర్వాత ఔట్ డేట్ గా మారిపోతుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం విడుదలైనప్పటి నుంచి ఒక ఏడాది పాటు దాని హవా కొనసాగింది. అంత బాగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం ప్రీమియం మొబైల్స్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకోనిరావడమే. 2018లో విడుదలైన పోకో ఎఫ్1 మొబైల్లో అప్పటి ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. దీనిని కేవలం రూ.20వేలకే అందుబాటులో ఉంచడంతో చాలా మంది ఎగబడి కొన్నారు. అంతలా సక్సెస్ అయిన ఈ మొబైల్ కి కొనసాగింపుగా పోకో ఎఫ్2ను తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని అందుబాటులోకి తీసుకొనిరాలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి తీసుకోని రానున్నట్లు సమాచారం. ఇటీవలే పోకో ఇండియన్ డైరెక్టర్ అనుజ్ శర్మ, క్వాల్కామ్ ప్రాసెసర్ ప్రతినిధితో ట్విటర్ లో మాట్లాడిన వీడియోలో త్వరలో మరో కొత్త మొబైల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఆ రాబోయే మొబైల్ పోకో ఎఫ్2 కావచ్చు అని చాలా మంది నిపుణలు భావిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్/875 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చని అంచనా. పోకో ఎఫ్2 లీకైన స్పెక్స్‌లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. పోకో ఎఫ్2 5జీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానుంది. ఇది రూ.25వేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. (చదవండి: టెస్లాకు పోటీగా మరో ఎలక్ట్రిక్ కారు) -
త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల
ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లలో ఈ ఏడాది(2021)లో పోకో F2 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తాజాగా పేర్కొంది. 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. 2018లో విడుదల చేసిన పోకో F1 స్మార్ట్ ఫోన్ స్థానే సరికొత్త ఫీచర్స్‌తో పోకో F2ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. 10 లక్షల ఫోన్లను విక్రయించడం ద్వారా దేశీయంగా ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో టాప్-5లో ఒకటిగా నిలుస్తున్నట్లు పోకో వెల్లడించింది. అయితే పోకో F2 స్మార్ట్ ఫోన్ సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫీచర్స్పై టిప్‌స్టెర్ తదితర టెక్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. చదవండి: (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) ఫీచర్స్ ఇలా పోకో F2 స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో విడుదలకానుంది. గతంలో రూ. 16,000 ధరలో విడుదల చేసిన పోకో X3 మోడల్లో వినియోగించిన ఎస్వోసీతో 4,250 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ సెన్సర్‌తో క్వాడ్కెమెరాలకు వీలుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయనుంది. ఈ స్పెసిఫికేషన్స్ అంచనాలతో చూస్తే పోకో F2 స్మార్ట్ ఫోన్ ధరలు రూ. 20,000-25,000 మధ్య ఉండవచ్చు. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) -
అద్భుతమైన డిస్ప్లేతో పోకో ఎక్స్ 2 వచ్చేసింది..
సాక్షి,ముంబై: షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్‌తో ఆకట్టుకున్న పోకో ఎక్స్ 1 తరువాత, ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎక్స్ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2 బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్టెల్ లేదా జియో నెట్‌వర్క్‌లో ద్వారా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ , ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. పోకో ఎక్స్ 2 ఫీచర్లు 6.67 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ 1080x2380 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 64+8+2+2 ఎంపీ రియర్ ఎమెరా 20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్‌బ్యాటరీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే, క్విడ్ కూలింగ్, యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 27 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 960 ఎఫ్‌పీఎస్‌లో స్లో-మోషన్ వీడియోలను రికార్డింగ్ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి. ధరలు : 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ .16,999 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999 పోకో ఎక్స్ 2 ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ కొనుగోలుపై అదనంగా రూ .1000 మినహాయింపు పొందవచ్చు. #POCOX2 key specs: - #120HzDisplay. - 64MP IMX686 Quad cam. - 20MP+2MP in-screen front cam. - SD 730G+LiquidCool Tech. - 4500mAh battery+27W in box charger. - Up to 8GB+256GB. - Starts @ 15,999. Let's see if can get 10K RTs. If we do, we give away, not 1 but 2 #POCOX2. #SmoothAF pic.twitter.com/i7k7IknIA5 — POCO India (@IndiaPOCO) February 4, 2020 -
పోకో ఎఫ్1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: షావోమీ సబ్ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఫ్లాష్ సేల్‌లో రికార్డు విక్రయాలను నమోదు చేసిన పోకోఎఫ్1 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 5వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది. డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌లోఈ ఆఫర్ లభించనుంది. ట్విటర్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ట్వీట్ల ద్వారా వినియోగదారులను గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు మొత్తం అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ POCO community is live! Yes, you read it right. We are launching POCO community, a place where POCO fans from around the globe can come together and feel at home. So what are you waiting for? Log on to https://t.co/d1eeZRKzSi and be a part of POCO community now! 🤟 pic.twitter.com/V7FgM9RmrT — POCO India (@IndiaPOCO) December 4, 2018 -
దివాలీ ధమాకా : రూ.1 కే స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి సబ్‌బ్రాండ్ పోకో కింద విడుదల చేసిన పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారీ విక్రయాలతో అదరగొట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు కేవలం రూ.1 కే లభించనుంది. దివాలీ ఆఫర్‌గా అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ సేల్ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర 23, 999 లు. తాజా సేల్‌లో రేపు సాయంత్రం నాలుగు గంటలకు రూ.1కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ.కాం ద్వారా సాయంత్రం 4.గంటలకు (పరిమితి సమయం) ఈ సేల్ ఉంటుంది. దీంతోపాటు ఇతర షావోమి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు అమ్మకాలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ‘దివాలీ విత్ ఎంఐ' సేల్ ఆఫర్లు : రెడ్మీ నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 2వేలు డిస్కౌంట్ అనంతరం రూ.12,999కు లభ్యం. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.14,999 రెడ్మీ వై2పై కూడా రూ.2వేలు తగ్గింపుతో రూ.12,999కే అందిస్తోంది. ఎంఐ ఏ2ను రూ.14,999లకు విక్రయిస్తోంది. వీటితోపాటు ఎంఐ లెడ్ టీవీ ఏ4 (43 అంగుళాలు) మోడల్ రూ.21,999కే ఈ స్పెషల్‌లో లభ్యం. పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేస్తే మరికొంత డిస్కౌంట్‌ను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంకులు, రౌటర్లు, బాడీ కాంపోజిషన్ స్కేల్, సెల్ఫీ స్టిక్, ఇయర్ఫోన్లపైనా భారీ ఆఫర్లు. Get #POCOF1 at Re 1/- Can't believe it? 🤔 Visit this link at 4 PM tomorrow: https://t.co/KEXfqNitL7 (Bookmark it!) RT and stand a chance to win exclusive POCO merchandise. 🔥 pic.twitter.com/Ojmqc3hnay — POCO India (@IndiaPOCO) October 22, 2018 -
మరోసారి సేల్కు వచ్చిన షావోమి పోకో ఎఫ్1
మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి. ఈ కంపెనీ తన సబ్‌బ్రాండ్ పోకో కింద పోకో ఎఫ్1 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే నాలుగుసార్లు విక్రయానికి వచ్చి అదరగొట్టింది. నేడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ మరోసారి విక్రయానికి వచ్చింది. పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో విక్రయానికి ఉంచింది షావోమి కంపెనీ. మూడు వేరియంట్లు ఒకటి.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్(ధర రూ.20,999), రెండు... 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్(రూ.28,999), మూడు.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ స్పెషల్ ఎడిషన్(ధర రూ.29,999)ను అందుబాటులో ఉంచింది. గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్, షావోమి అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితర ఫీచర్లతో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమి కంపెనీ. -
5 నిమిషాల్లో రూ. 200 కోట్లు
చైనా మొబైల్ తయారీదారు షావోమీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎదురులేని రారాజులా దూసుకుపోతోంది. ఇటీవల పోకో సబ్‌బ్రాండ్ ద్వారా లాంచ్ చేసిన పోకో ఎఫ్ 1 అపూర్వమైన సేల్స్‌ను నమోదు చేసింది. ఆగస్టు 29న ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో కళ్లు తిరిగే ఆదాయాన్ని ఆర్జించింది. కేవలం ఐదు నిమిషాల్లో రూ. 200 కోట్ల విలువైన షావోమి పోకో ఎఫ్ 1 ఫోన్లు విక్రయించింది. పోకో ఎఫ్ 1 మొదటి ఫ్లాష్‌సేల్‌లో భారీ విక్రయాలను సాధించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది బిగ్గెస్ట్, ఫాస్టెస్ట్ సేల్ అని పేర్కొంది. అలాగే తదుపరి ఫ్లాష్‌సేల్ సెప్టెంబరు 5న ఉంటుందని ప్రకటించింది. అయితే విక్రయించిన స్మార్ట్ఫోన్ల సంఖ్యను సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ టాప్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో 68వేల యూనిట్లను, 1 లక్షల దాకా బేస్ వేరియంట్ డివైస్‌లను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అంచనా. కాగా పోకో ఎఫ్ 1 స్మార్ట్‌ఫోనును మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 6జీబీర్యామ్/64 స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర .20,999 గానూ, 6జీబీర్యామ్/128 స్టోరేజ్ (రెండవ వేరియంట్)ధర 23,999 రూపాయలుగాను, 8జీబీర్యామ్/256 స్టోరేజ్ (టాప్ ఎండ్ వేరియంట్) రూ .28,999గా నిర్ణయించింది. దీంతో పాటు స్పెషల్ ఎడిషన్ రెడ్ వేరియంట్ రూ. 29,999 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ప్రారంభ అమ్మకాల్లోనే బ్రేకింగ్ రికార్డులతో దూసుకుపోతున్నషావోమి సబ్‌బ్రాండ్ పోకో గ్లోబల్ మార్కెట్లో లాంచింగ్ అనంతరం భారీ ప్రభావాన్నే చూపనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి -
పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: జియో భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ షావోమి సబ్‌బ్రాండ్ పోకో స్మార్ట్‌ఫోన్ అభిమానులకు ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళితో వస్తోంది. భారత మార్కెట్లోకి సరికొత్త పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో పోకో ఫోన్ ఎఫ్1 ప్రారంభ ధర రూ.20999గా నిర్ణయించింది. ఆగస్టు, 29 మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి లభించనుంది. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే రిలయన్స్ జియో భారీ ఆఫర్ అందిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రూ.8 వేల తక్షణ ప్రయోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. అదీ 6టీబీ హైస్పీడ్ డేటాతో. దీంతోపాటు హెచ్డీఎఫ్ఎసీ కార్డు ద్వారా కొనుగోళ్లపై వెయ్యి రూపాయల తగ్గింపును అందించనుంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితరఫీచర్లతో బ్లూ, గ్రే రంగుల్లో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.