అద్భుతమైన డిస్‌ప్లేతో పోకో ఎక్స్ 2 వచ్చేసింది.. | Poco X2 launched in India with 120Hz display | Sakshi
Sakshi News home page

అద్భుతమైన డిస్‌ప్లేతో పోకో ఎక్స్ 2 వచ్చేసింది..

Published Tue, Feb 4 2020 1:17 PM | Last Updated on Tue, Feb 4 2020 11:11 PM

Poco X2 launched in India with 120Hz display  - Sakshi

సాక్షి,ముంబై: షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్‌తో ఆకట్టుకున్న పోకో  ఎక్స్‌ 1 తరువాత, ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎక్స్‌ 2  పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2  బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది.  అలాగే ఎయిర్‌టెల్ లేదా జియో నెట్‌వర్క్‌లో ద్వారా వై ఫై కాలింగ్‌ సదుపాయాన్ని కూడా  ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ ,  ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

పోకో ఎక్స్ 2 ఫీచర్లు
6.67 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌
1080x2380  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 10
64+8+2+2  ఎంపీ రియర్‌ ఎమెరా
20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా 
4500 ఎంఏహెచ్‌బ్యాటరీ

120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే, క్విడ్‌ కూలింగ్‌, యుఎస్‌బి టైప్‌-సి పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, 27 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 960 ఎఫ్‌పీఎస్‌లో  స్లో-మోషన్ వీడియోలను రికార్డింగ్‌ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి. 

ధరలు :
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ .16,999 
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999 

పోకో ఎక్స్ 2 ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్  కొనుగోలుపై అదనంగా రూ .1000 మినహాయింపు పొందవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement