సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పొకో కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో మంగళవార విడుదల చేసింది. పొకో ఎం3 ప్రొ పేరుతో రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
తొలి సేల్, ధరలు, లాంచింగ్ ఆఫర్
4 జీబీ B ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999
ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ ఆఫర్‌గా జూన్ 14 న మాత్రమే తొలి సేల్‌లో రెండు వేరియంట్లపై 500 తగ్గింపు ఇస్తున్నట్లు పొకో ఇండియా పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ సేల్ జూన్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తద్వారా 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు గట్టి పోటి ఇస్తోంది.
పొకో ఎం3 ప్రొ ఫీచర్లు
6.50 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 11
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్
8 మెగా పిక్సెల్ సెల్ఫీకెమెరా
48+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
Hard-hitting performance and a phone that can take hard hits. The #POCOM3Pro comes equipped with the uber-safe Corning ® Gorilla ® Glass protection. Basically, no place for mini-heart attacks. #MadSpeedKillerLooks pic.twitter.com/iY8tUqWtUZ
— POCO India - Register for Vaccine 💪🏿 (@IndiaPOCO) June 8, 2021
Comments
Please login to add a commentAdd a comment