న్యూఢిల్లీ: పోకో ప్రియులు ఎంతగానో ఇష్టపడే పోకో ఎం3 మొబైల్ నేడు ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. పోకో ఎం3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.(చదవండి: మహిళను రక్షించిన యాపిల్ స్మార్ట్‌వాచ్)
పోకో ఎం3 ఫీచర్స్:
డ్యూయల్ నానో సిమ్ గల పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 మీద పనిచేయనుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.79 లెన్స్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 మాక్రో లెన్స్‌తో 2ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం పోకో ఎం3 ముందు భాగంలో ఎఫ్/2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.
పోకో ఎం3 64జీబీ,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనిలో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 198 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!)
పోకో ఎం3 ధర:
భారతదేశంలో పోకో ఎం3 6 జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.10,999 ఉండగా, 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో సేల్ కి రానుంది. పోకో ఎం3ను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment