Poco M3 Has Been Launched Globally: భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3 - Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3

Published Wed, Nov 25 2020 11:39 AM | Last Updated on Wed, Nov 25 2020 3:39 PM

Poco M3 is Official With 6KmAh Battery That Can Charge Other Devices - Sakshi

మొబైల్ మార్కెట్ లో చైనా సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పోకో ఎం2 అప్‌గ్రేడ్ మోడల్ ఇది. భారత్ లో విడుదల చేసిన పోకో ఎం2 బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. దింతో రాబోయే పోకో ఎం3పై కూడా అంచనాలు పెరిగాయి. చివరికి ఈ సరికొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది పోకో. కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పాటు 48 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. దీనిలో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: షాక్ గురైన స్నాక్ వీడియో యూజర్లు)


పోకో ఎం3 ఫీచర్స్    

పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10సపోర్ట్ తో ఎంఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడవనుంది. ఇందులో 90.34 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.53-అంగుళాల పూర్తి-హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. డిస్ప్లే కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, దీనితో పాటు 4జీబీ ఎల్ పీడీడీఆర్ఎక్స్ ర్యా మ్ ఉంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.79 లెన్స్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌ 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3 64జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ లలో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ వేయడం ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో ఎం3లోని కనెక్టివిటీ కోసం 4జీ ఎల్ టీఈ, వై -ఫై, బ్లూటూత్, జిపిఎస్/ ఏ-జిపిఎస్, యుఎస్ బి టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ ను కలిగి ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: 15 వేలలో లోపు ఇవే బెస్ట్!)

పోకో ఎం3 ధర

4జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు పోకో ఎం3 ధర.149 డాలర్లు(సుమారు రూ. 11,000)గా నిర్ణయించబడింది. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర. 169 డాలర్లు(సుమారు రూ. 12,500) ధరను కలిగి ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 రిలీజ్ అయింది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్‌లో ఉన్నాయి. మరి పోకో ఎం3 ఇండియాకు వస్తుందా? దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement