ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ రూ.15వేల లోపు బడ్జెట్ ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. గతేడాది శాంసంగ్ మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ03ఎస్ సిరీస్‌లో 3వ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీని ఏ 03ని తాజాగా దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ధర
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ని రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ చేసింది. 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేష్ ఆప్షన్ ధర రూ.10499 ఉండగా 4జీబీ ప్లస్ 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ నలుపు, నీలం, ఎరుపు వేరింయంట్ కలర్స్‌లో లభ్యం అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ స్పెసిఫికేషన్‌లు
• శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే
• 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్
• యూఎన్ఐ ఎస్ఓసీ టీ606 ఎస్ఓఎస్‌తో వస్తుంది.
• గరిష్టంగా 4జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
• 1టెరాబైట్ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు
• మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
• వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
• 48ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.
• ఇందులో 2MP డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీల కోసం, ఫోన్‌లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
• 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
• ఆండ్రాయిడ్ 11కి సపోర్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment